Saturday, May 4, 2024
- Advertisement -

పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌..

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్ సునామీ సృష్టించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆది నుంచి విజృంభించి ఆడింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన కేకేఆర్‌.. కింగ్స్‌ బౌలర్లను దుమ్ముదులిపారుజ.

నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది.

ఓపెనర్ సునీల్ నరైన్ (75: 36 బంతుల్లో 9×4, 4×6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50: 23 బంతుల్లో 5×4, 3×6) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభ ఓవర్లలో క్రిస్‌లిన్ (27: 17 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి సునీల్‌ నరైన్ దూకుడుగా ఆడి భారీ స్కోరుకి బాటలు వేయగా.. మిడిల్ ఓవర్లలో రాబిన్ ఉతప్ప (24: 17 బంతుల్లో 2×4, 1×6), ఆండ్రీ రసెల్ (31: 14 బంతుల్లో 2×4, 3×6), దినేశ్ కార్తీక్ భారీ షాట్లతో చెలరేగారు. దీంతో.. ఆండ్రూ టై (4/41) మినహా పంజాబ్ బౌలర్లందరూ చేతులెత్తేశారు.

నరైన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కాగా, నరైన్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆండ్రూ టై బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 36 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు సాధించిన నరైన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

కార్తీక్‌ హాఫ్‌ సెంచరీ తర్వాత తాను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యాడు. దాంతో 230 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇక చివర్లో శుభ్‌మాన్‌ గిల్‌(16 నాటౌట్‌;8 బంతుల్లో 3 ఫోర్లు), సీర్లెస్‌(6 నాటౌట్‌; సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ 246 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ పంజాబ్‌ ముందుంచింది. కింగ్స్‌ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు సాధించగా,బరిందర్‌ శ్రాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -