Sunday, May 12, 2024
- Advertisement -

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై ఘ‌న‌విజ‌యం సాధించిన ముంబ‌య్ ఇండియ‌న్స్‌..

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. మొద‌టి నుంచి పేవ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ను కొనసాగించిన రోహిత్ సేన విజ‌యాల బాట ప‌ట్టింది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది.

తొలుత ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లావిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ (59: 39 బంతుల్లో 7×4, 2×6), ఎవిన్ లావిస్ (43: 28 బంతుల్లో 5×4, 2×6), హార్దిక్ పాండ్య (35 నాటౌట్: 20 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు..

అనంతరం కోల్‌కతాని 168 పరుగులకే కట్టడి చేసేసింది. ఛేదనలో రాబిన్ ఉతప్ప (54: 35 బంతుల్లో 6×4, 3×6), నితీశ్ రాణా (31: 27 బంతుల్లో 3×4, 1×6) దినేశ్ కార్తీక్ (36 నాటౌట్: 26 బంతుల్లో 5×4, 1×6) మెరిసినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో కోల్‌కతాకి ఓటమి తప్పలేదు. ఆ జట్టు ఆఖరికి 168/6కే పరిమితమైంది. టోర్నీలో ముంబయికి ఇది నాలుగో విజయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -