Sunday, May 5, 2024
- Advertisement -

అశ్విన్ తొండాట‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్‌

- Advertisement -

సోమ‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జైపూర్ వేదిక‌గా రాజస్థాన్ రాయల్స్,కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్టు 184 పరుగులు చేసి భారీ స్కోరు రాజస్థాన్ జ‌ట్టు ముందుంచింది. 184 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతోమ దిగిన రాజ‌స్ధాన్ ఆరంభంతో అద‌ర‌గొట్టింది. అయితే త‌మ జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపిస్తున్న జోస్ బట్లర్ ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేసిన విధానంపై యావ‌త్ క్రికెట్ ప్రేమికులు మండిప‌డుతున్నారు. అశ్విన్ తొండాట ఆడాడని, చేయకూడని పని చేశాడని, అలా చేసే ముందు ఓ మారు హెచ్చరించి ఉంటే బాగుండేదని మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు అంటున్నారు. అశ్విన్ బంతిని వేయబోయే సమయానికి బట్లర్ క్రీజును దాటి బయటకు రాగా, బాల్ వేయని అశ్విన్, బెయిల్స్ ను పడదోసి అపీల్ చేశాడు.

థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో బట్లర్ ఆగ్రహంతో మైదానాన్ని వీడాడు. దీనిపై క్రికెట్ ప్రేమికులు అశ్విన్‌ను తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. బట్లర్‌ క్రీజ్‌ దాటేవరకు వేచి చూడాలన్న ఉద్దేశం అశ్విన్ లో కనిపించిందని, క్రీడా స్ఫూర్తికి ఇది మాయని మచ్చని అంటున్నారు. కొందరు ఫ్యాన్స్ అశ్విన్‌ తెలివిని ప్రశంసిస్తున్నప్పటికీ, ఎక్కువ మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్టు విజ‌యం సాధించిన‌ప్ప‌టికి అస‌లైన విజ‌యం మాత్రం రాజ‌స్థాన్‌దే అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. అయితే తాను చేసిన ప‌నిని స‌మ‌ర్థించుక‌న్నాడు అశ్విన్‌. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్‌ యాక్షన్‌ పూర్తి కాకముందే అతను క్రీజ్‌ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న విష‌యాలే మ్యాచ్‌ల‌ను మార్చేస్తాయాని తాను చేసిన చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకున్నాడు అశ్విన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -