Tuesday, May 14, 2024
- Advertisement -

చిన్న‌నాటి గురువు ర‌మాకాంత్‌ ఆచ్రేక‌ర్ పాడె మోసి స‌చిన్‌…

- Advertisement -

క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు క్రికెట్‌లో ఓనమాలు నేర్పించిన గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ కన్ను మూసిన సంగ‌తి తెలిసిందే. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల అచ్రేకర్ బుధవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న అంతిమ యాత్ర ఈ రోజు ముగిసింది.

బుధ‌వారంలో ముంబయిలోని తన స్వగృహంలో మరణించిన రమాకాంత్‌ అచ్రేకర్ కు సచిన్‌తో పాటు మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. ఈరోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా ఆరంభమైన నాలుగో టెస్టులోనూ ఇరు జట్ల ఆటగాళ్లు సంతాప సూచకంగా ‘బ్లాక్ రిబ్బన్‌‌’ని చేతికి ధరించి మ్యాచ్ ఆడారు.

ముంబ‌యిలో జ‌రిగిన ఆచ్రేక‌ర్ అంతిమ యాత్ర‌కు కాంబ్లి, స‌చిన్ ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు. స‌చిన్ త‌న గురువు రుణం తీర్చుకున్నారు. టెండూల్కర్.. స్వయంగా తన చిన్ననాటి కోచ్ భౌతిక కాయాన్ని ఉంచిన పాడెను మోశారు. ఆ సమయంలో సచిన్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -