- Advertisement -

తొలి వ‌న్డేలో ర‌హానేను తీసుకోలేదో..క్లారిటీ ఇచ్చిరోహిత్ శ‌ర్మ‌….

- Advertisement -

శ్రీలంతో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల‌లో భాగంగా..ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో టీమిండియా ఘోరంగా ఒట‌మిని చ‌విచూసింది. లంక బౌల‌ర్ల‌దాటికి త‌ట్టుకోలేక ధోనీ మిన‌హా బ్యాట్స్‌మేన్‌లంద‌రు చేతులెత్తేయ‌డంతో..శ్రీలంక ఘ‌న‌విజ‌యం సాధించింది.

మొద‌టి వ‌న్డేలో ర‌హానేను ఎందుకు తీసుకోలేదో వివ‌ర‌న ఇచ్చారు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. సీమర్లకు అనుకూలించిన పిచ్ పై మన బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమయ్యారు. అయితే, సీమర్లను సమర్థంగా ఎదుర్కొనే రహానేను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానమిచ్చాడు.

సీమర్లను సమర్థంగా ఎదుర్కొనే రహానేను ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పేనని రోహిత్ ఒప్పుకున్నాడు. అయితే, రహానేను బ్యాక్ అప్ ఓపెనర్ గానే సెలెక్టర్లు ఎంపిక చేశారని… అందువల్లే అతడిని మిడిల్ ఆర్డర్ లో ఆడేందుకు ఎంపిక చేయలేదని చెప్పాడు. ఈ మ్యాచ్ లో మరో 70-80 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. చెత్త బ్యాటింగే ఓటమికి కారణమని… ఈ మ్యాచ్ తమకు ఒక గుణపాఠం లాంటిదని తెలిపాడు. ధోనీ అద్భుత బ్యాటింగ్ తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని… ఎందుకంటే అతని సమర్థత ఏంటనేది తనకు పూర్తిగా తెలుసని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -