- Advertisement -

రెండో టీ20లో టీమిండియా ఓటమి

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది సఫారీ జట్టు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగగా డక్ వర్త్ లూయిస్ ప్రకారంలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది దక్షిణాఫ్రికా.

డక్ వర్త్ లూయిస్ ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152గా నిర్దేశించగా గెలవాలంటే ఓవర్‌కు పదికి పైగా రన్స్ చేయాల్సి ఉండగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెచ్చిపోయారు. రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లో 49 పరుగులు చేయగా మాథ్యూ బ్రీట్జ్కీ 7 బంతుల్లో 16, ఎయిడెన్ మార్‌క్రమ్ 17 బంతుల్లో 30 పరుగులు చేయడంతో 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 180/7గా ఉన్నప్పుడు వరణుడు అంతరాయం కలిగించాడు. టీ రింకూ సింగ్ 39 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులు చేశాడు. తలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -