Sunday, May 12, 2024
- Advertisement -

టాస్ గెలిచి లంక‌పై ఫిల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

- Advertisement -

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా కాసేపట్లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి స‌పారీలు ఫిల్డింగ్ ఎంచుకున్నారు. టోర్నీలో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లాడిన సఫారీ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.

లంక ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి రెండు ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.

వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి. అయితే.. వన్డే రికార్డుల్లో మాత్రం లంకేయులపై సఫారీలదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లూ ఇప్పటి వరకూ 33 వన్డేలాడగా.. ఇందులో ఏకంగా 18 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక 14 వన్డేల్లో లంక గెలవగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆ జట్టు చివరి మ్యాచ్‌ను పటిష్టమైన ఆస్ట్రేలియా (జూలై 6న)తో ఆడాల్సి ఉంది. లంక చేతిలో ఓడితే, ఇక ఆసీస్‌ను నిలువరించడం అసాధ్యం. అదే జరిగితే తమ చరిత్రలోనే అత్యంత దారుణ పరాభవం మిగులుతుంది.

లంక జట్టు: కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజిలో మాథ్యుస్‌, ధనంజయ డిసిల్వ, థిసారా పెరీరా, జీవన్‌ మెండిస్‌, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, సురంగ లక్మల్‌

దక్షిణాఫ్రికా: హషీమ్‌ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), మార్‌క్రమ్‌, వాన్‌ డర్‌ డుస్సెన్‌, జేపీ డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, క్రిస్‌ మోరిస్‌, రబాడ, ఇమ్రాన్‌ తాహిర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -