మరో వారంరోజుల్లో ఆస్ట్రేలియా గడ్డపై టి20 సమరం మొదలు కానుంది. ఇప్పటికే కీలక జట్లన్నీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాయి. ఈసారి పొట్టి కప్పు ను చేజిక్కించుకునేందుకు అన్నీ జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. టీమిండియా తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక.. ఈ జట్లన్నీ కూడా ప్రస్తుతం పటిష్టంగా ఉండడంతో ఈసారి టి20 వరల్డ్ కప్ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. దాంతో టీమిండియా శక్తికి మించి చమటోడ్చాల్సిన అవసరం ఉంది. టీమిండియా ప్రస్తుతం దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నప్పటికి.. బౌలింగ్, ఫీల్డింగ్ వంటి వంటిలో మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ఫీల్డింగ్ లో టీమిండియా గత కొన్నాళ్లుగా ఫెళవ ప్రదర్శన కనబరుస్తోంది. టీమిండియా ఆసియా కప్ లోనుంచి నిష్క్రమించడానికి ఫెళవమైన ఫీల్డింగ్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఫీల్డింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరత ఉందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు మెరుగ్గా ఉన్నాయని, ఆ జట్లతో పోలిస్తే భారత్ తమ స్థాయిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి అన్నాడు.
భారత్ ను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఇదేనని ఆయన చెప్పుకొచ్చాడు. ఒక జట్టు యొక్క జయాపజయలలో ఫీల్డింగ్ కీలక పాత్ర వహిస్తుందని, దానిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక గత టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా విరాట్ కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా ఊహించని విధంగా లీగ్ దశలోని నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ చేదు జ్ఞాపకాలను మరచిపోయే విధంగా ఈసారి కప్పు వేటలో గట్టి పట్టుదలతో ఉంది టీమిండియా. మరి ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
