Friday, March 29, 2024
- Advertisement -

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈఓ పై వేటు..!

- Advertisement -

గత నెలలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యాక్టింగ్​ సీఈఓగా నియమితులైన కుగాండ్రీ గోవెందర్​ సస్పెన్షన్​కు గురయ్యారు. గతంలో ఆమె బోర్డు చీఫ్​ కమర్షియల్​ ఆఫీసర్​గా పనిచేసినప్పడు.. ప్రస్తుత పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పడు ఆమె ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన బోర్డు.. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ ఫొలెసి మోసెకిని ఆ స్థానంలో భర్తీ చేసింది. దీంతో 2020లో మూడో యాక్టింగ్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు ఫొలెసి. మరోవైపు సెక్రటరీ వెల్ష్ గ్వాజా కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.

2022 ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​నకు అర్హత సాధించేందుకు 86 జట్లు పోటీ పడనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) పేర్కొంది. టోర్నీలో పాల్గొనే జట్ల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిపింది. 13 నెలల వ్యవధిలో 225 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -