Monday, May 6, 2024
- Advertisement -

పాక్ vs ఇం డియా : భ‌విత‌వ్యం తేలేది నేడే…?

- Advertisement -

పుల్వామా ఘ‌ట‌న భార‌త్‌, పాక్ దేశాల క్రికెట్‌పై తీవ్ర ప్ర‌భాదం చూపింది. ఘ‌ట‌న నేప‌థ్యంలో పాక్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ప్ర‌పంచ క‌ప్‌లో పాక్‌తో మ్యాచ్ ను భార‌త్ ఆడకుండా బ‌హిష్క‌రించాల‌ని ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్లు సూచించారు. దీనిపై భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఓ నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ పాలకుల కమిటీ ఈరోజు సమావేశమవుతోంది.ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది.

మరోవైపు భారత్ జట్టు ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తే..? పాకిస్థాన్‌ని విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. అంటే.. మనమే ఆ జట్టుని గెలిపించి టోర్నీలో ముందజ వేసేలా చేస్తున్నామని నిన్న సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచకప్‌ నుంచి నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)‌కి లేఖ రాయడంపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. పాక్‌ను బ‌హిష్క‌రించ‌డం వీలు కాక‌పోతే అప్పుడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే అంశాన్ని తెరపైకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. పాక్‌తో ఆడాలా వ‌ద్దా అనేది ఈ రోజు తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -