Wednesday, May 1, 2024
- Advertisement -

రాజకీయ లబ్దికోసమేనా… ప్రజల కోసం ఉందా..!

- Advertisement -
Is Opposition Parts same Stand on Andhra Pradesh Special Status..?

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి ప‌క్ష పార్టీల‌కు ప్ర‌త్యేక హోదా ఆక్సీజ‌న్ లాంటిది. ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయమ‌ని కేంద్రం ప్ర‌క‌టించినా … పార్టీల‌న్నీ దీన్నే ప‌ట్టుకొని వేలాడుతున్నాయి. రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు జ్ణానోద‌యం అయిన‌ట్లుంది అధిష్టానానికి.

అందుకే గుంటూరులో ప్ర‌త్యేక హోదా స‌భ‌ను నిర్వ‌హించి జాతీయ నాయ‌కుల‌తోపాటు ఏపీలోఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌కును ఆహ్వానించింది. కాని ప్ర‌త్యేక హోదాపై నాయ‌కుల‌కు చిత్త‌శుద్ధి ఉందా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మాట‌ల్లో ఉన్న చిత్త శుద్ధి చేత‌ల్లో క‌నిపించ‌డంలేద‌న్న‌ది ప్ర‌జ‌ల‌ల్లో ఉన్న భావ‌న‌.
ఏపీకీ ప్ర‌త్యేక హోదాసాధ‌న‌కోసం కాంగ్రెస్ గుంటూరులో భారి బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది.ఈ స‌భ‌కు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతోపాటు ప్ర‌ముఖ జాతీయ పార్టీ నాయ‌కుల‌ను హాజ‌ర‌య్యారు. స్థానికంగా ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న జ‌న‌సేన‌,వైసీపీల‌కు ఆహ్వానం పంపింది. జాతీయ పార్టీల‌న్నీ ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని భాజాపాపై నిప్పులు చెరిగారు.రాహుళ్ గాంధీ అయితే ఏకంగా కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం ప్ర‌త్యేక హోదా ఫైలుపైనే పెడ‌తామ‌నిప్ర‌క‌టించారు.ఇదంతా బాగానే ఉంది.

{loadmodule mod_custom,GA1}

ఇక స్థానికంగా ప్ర‌త్యేక హోదా కోసం బ‌లంగా పోరాడుతున్న పార్టీలు వైసీపీ,జ‌న‌సేనలు.గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామి ఇచ్చిన‌ టీడీపీ-భాజాపా కూట‌మికి ప‌వ‌ణ్ మ‌ద్ద‌తిచ్చారు.కాని ఈ అంశంపై న్యూట‌ర్న్ తీసుకోవ‌డంతో జ‌న‌సేన అధినేత దూరంగా జ‌రిగారు.ఒంట‌రిగా ప్ర‌త్యేక హోదాకోసం పోరాడుతున్నారు.ఒక ప‌క్క ప్ర‌త్యేక‌హోదా అంటూనే …టీడీపీతో పూర్తిగా తెగ‌దెంపులు చేసుకోలేదు.మ‌రో ప‌క్క టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ప‌వ‌ణ్‌ను ఎవ‌రూ ఏమి అన‌ద్ద‌ని పార్టీ నాయ‌కుల‌కు సూచించారు.గుంటూరులో కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌భ‌కు రాక‌పోయినా ట్విట్ట‌ర్‌లో మాత్రం త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.ఇలా సోషియ‌ల్ మీడియాలో ట్వీట్‌లు చేసే బ‌దులు స‌భ‌కు హాజ‌ర‌యిఉంటె ప్ర‌జ‌ల‌కు ఒక మెసేజ్ వెల్లి ఉండేది.
వైసీపీ అధినేత జ‌గ‌న్‌కూడా ప్ర‌త్యేక‌హోదాకోసం పోరాటాలు చేస్త‌న్నారు.అన్ని పార్టీలు జెండాలు వేర‌యినా గ‌మ్యం మాత్రం ప్ర‌త్యేక‌హోదానే.జ‌న‌సేన అధినేత ప‌వ‌ణ్ క‌నీసం ట్విట్ట‌ర్ ద్వారానైనా కాంగ్రెస్ నిర్వ‌హించి స‌భ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు…కాని జ‌గ‌న్‌గాని ఆపార్టీ నాయ‌కులుగాని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.ఒక వైపు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్తి ఎన్నిక విష‌యంలో కేంద్రంలోని ఎన్‌డీఏకు మ‌ద్ద‌తు ఇస్తూ …మ‌రో ప‌క్క ప్ర‌త్యేక‌హోదా అంటారు.రెండు నాలుక‌ల ధోర‌ని ప్ర‌ద‌ర్శిస్తే ప్ర‌జ‌లు ఎలా న‌మ్ముతారు.

{loadmodule mod_custom,GA2}

అంద‌రూ కూడా ప్ర‌త్యేక హోదా కావాల‌ని నోటి మాట‌ద్వారానే చెప్తారేగాని… చేత‌ల్లోమాత్రం చిత్త‌శుద్ధి క‌నిపించ‌డంలేదు. అన్ని పార్టీల గ‌మ్యం ఒక‌టే అయిన‌పుడు ఎందుకు ఒకే వేదిక మీద‌కు రావ‌డంలేద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గామారింది.ప్ర‌త్యేక‌హ‌దా క్రెడిట్ మాకంటె మాకే ద‌క్కాల‌ని ఎవ‌రికి వారే అన్న‌చందంగా త‌యార‌య్యారు.తెలంగాణాలో అన్ని పార్టీలు ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాయి.అలా క‌ల‌సి క‌ట్టుగా పోరాటం చేయ‌కుండా ఎవ‌రికి వారే పోరాటం చేస్తే ప్ర‌త్యేక‌హోదా వ‌స్తాదానన్న‌ది నాయ‌కుల‌కే ఎరుక‌.మాట‌ల్లో కాకుండా అన్ని పార్టీలు చేతల్లో చేసి చూపిస్తే కాస్తైనా ప‌లితం ఉంటుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -