Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ లో ఒ క్క ఎపీసోడ్ ఖ‌ర్చు…45 కోట్లు

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశం ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక భారీ పోరాట సన్నివేశామని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎన్టీఆర్ పై షూటింగ్ జరుగుతున్నది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ను ఎన్టీఆర్ పై షూట్ చేస్తున్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాంజానియా నుంచి తిరిగి వచ్చారు. రేపోమాపో అయన కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ స్థాయిలో ఒక ఎపిసోడ్ కోసం ఖర్చు చేయడం అంటే మాటలు కాదు. ఎన్టీఆర్ .. చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశంలో పాల్గొననున్నట్టు సమాచారం. విజువల్ వండర్ గా అనిపించే ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -