Friday, April 26, 2024
- Advertisement -

“90ఎంఎల్” మూవీ రివ్యూ

- Advertisement -

ఆర్ఎక్స్ 100 తో మంచి హీరోగా కార్తికేయ పేరు తెచ్చుకున్నాడు. తాజాగా 90ఎంఎల్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. కార్తికేయ సరసన నేహా సోలం హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శేఖర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఒక ఆల్కాహాలిక్ డిజార్డర్ తో హీరో కార్తికేయ పుడతాడు. అతనికి కొంత మోతాదులో మద్యం అందించాలని డాక్టర్ చెప్పగా అలాగే పెరుగుతాడు. అలా పెద్దొడైన కార్తికేయకి హీరోయిన్ నేహా సోలం నచ్చుతుంది. ప్రేమలో పడిపోతాడు. అక్కడ నుంచి సమస్యలు ఎదురవుతాయి. అలా క్లైమాక్స్ లో ఒక సవాల్ ఎదుర్కొంటాడు ఈ నేపథ్యంలో విలన్ రవికిషన్ కు ఉన్న ప్రాధాన్యత ఏంటి ? ఇలాంటి డిజార్డర్ వల్ల హీరో కి వచ్చిన సమస్యలు ఏంటి ? క్లైమాక్స్ లో తన ముందు ఉన్న చాలెంజ్ ను ఎలా ఎదుర్కొన్నాడు అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిదే.

ప్లస్ పాయింట్స్ :

హీరో కార్తికేయ ఎలాంటి పాత్ర ఇచ్చిన చేయగలను అని నిరూపించుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆల్కాహాలిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తిలా.. మరో పక్క లవర్ బాయ్ లా.. కామెడీలో టైమింగ్.. ఎమోషన్స్.. ఇలా అన్నింట్లో తనేంటో చూపించాడు. డ్యాన్స్ పరంగా కూడా కార్తికేయ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ నేహా సోలం కూడా తన పాత్రలో మెప్పించింది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ, ఎమోషనల్ చాలా బాగుంది. మరో మెయిన్ రోల్ చేసిన రవి కిషన్ కామెడీ చేస్తూనే విలన్ గా కూడా మెప్పించాడు. రావు రమేష్, కమెడియన్ ఆలీ సహా మిగతా పాత్రదారులు తమ తమ పాత్రల పరిధికి మంచి నటన కనబర్చారు. దర్శకుడు శేఖర్ రెడ్డి మంచి ప్లాట్ లైన్ తీసుకున్నారు. కామెడీ ట్రాక్స్ తో సినిమాని ఎక్కువగా నింపేశారు. శేఖర్ రెడ్డి క్లైమాక్స్ ను తెరకెక్కించిన విధానం కాస్త విభిన్నంగా ఉంది. అనూప్ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ కంటే సెకండాఫ్ స్లోగా ఉంటుంది. కామెడీ మీద ఫోకస్ పెట్టి కంటెంట్ ను పక్కన పెట్టారు. కొన్ని సీన్స్ రొటిన్ లాగా ఉన్నాయి. ఆల్కహాలిక్ సీన్స్ ఎక్కువయ్యాయి.

మొత్తంగా : 90ఎంఎల్ కామెడీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అలరిస్తోంది. కార్తికేయ కనబరిచిన నటన బాగుంది. ఎడిటింగ్ పై డైరెక్టర్ కాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. కామెడీ ని ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -