సమంత సినిమా కి నిజంగా అంత సీన్ ఉందా?

212
Akkineni Samantha's Oh Baby First Look
Akkineni Samantha's Oh Baby First Look

సమంత హీరోయిన్ గా త్వరలో రాబోతున్న చిత్రం ఓ బేబీ. కొరియన్ సినిమా మిస్ గ్రానీ సినిమా ని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకం గా ఈ సినిమా ని ప్రెసెంట్ చేస్తుండగా, సునీత తాటి ఈ సినిమా కి నిర్మాత. ఇంతకు ముందు ఆవిడ కొరియర్ బాయ్ కళ్యాణ్, బంగారు కోడి పెట్ట మరియు సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు నిర్మించారు.

అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రచార పనులని మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పెద్దగా ఆకర్షించకపోయినా చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడ లేని విశ్వాసాన్ని ఈ సినిమా పై చూపిస్తున్నారు. అయితే సినిమా లో చాలా మార్పులు చేశారట దర్శక నిర్మాతలు. అయితే సినిమా కొరియన్ లో హిట్ కావడానికి ఎమోషన్ ముఖ్యమని, అది ఈ సినిమా లో ఎలా కన్వే చేస్తారు అనేదాన్ని బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.

కానీ ఒక పక్క సమంత, చైతన్య ఇంకా సినిమా కి పని చేసిన అందరూ ఈ సినిమా ఒక మెమరబుల్ మూవీ అవ్వబోతుంది అని చెప్తూ వచ్చారు. అయితే ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తుందో వేచిచూడాలి.

Loading...