Saturday, April 27, 2024
- Advertisement -

“అల వైకుంఠపురములో” మూవీ రివ్యూ

- Advertisement -

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్‌ కలయికలో ఇప్పటికే జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలాంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ’అల‌… వైకుంఠపుర‌ములో’. కుటుంబ క‌థ‌తోనే ఈ చిత్రం తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెప్తూ వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా టబు, జైరాం అలాగే సుషాంత్ మరియు నివేత పేతురాజ్ వంటి నటీనటులు నటించిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

బంటు (అల్లు అర్జున్‌) ఓ మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన కుర్రాడు. ఓ కంపెనీలో ఉద్యోగిగా చేరుతాడు. అక్కడ బాస్ గా హీరోయిన్ పూజా హెగ్డే ఉంటుంది. బంటు మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా ఆయనకు వైకుంఠపురము అనే ఓ పెద్దింటితో సంబంధం ఉంటుంది. ఆ పెద్దింటి యాజమాని ఓ సమస్యలో పడుతాడు. అదే టైంలో పెద్దింటితో తనకు ఉన్న సంబంధం ఏంటో.. తన పుట్టుక వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకుంటాడు బంటు. ఆ టైంలో అతను వైకుంఠపురంలోకి వెళ్లాల్సి వస్తోంది. మరి అక్కడికి వెళ్లి ఏం చేశాడు ? ఆ ఇంట్లో ఉన్నవాళ్ల మనసుల్ని ఎలా గెలిచాడు ? వాళ్ల సమస్యల్ని ఎలా తీర్చాడు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించాడు త్రివిక్రమ్. మ్యూజికల్ గా పెద్ద హిట్ అయిన ఈ సినిమా అదే రెంజ్ లో విజువల్స్ కూడా చూపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కామికల్ టైమింగ్ ను మనం మరోసారి చూడొచ్చు. అలానే త్రివిక్రమ్ సినిమా అంటే ఫలితంతో సంబంధం లేకుండా డైలాగులు కోసం ప్రతీ ఒక్కరూ అడుగుతారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ పేల్చినా డైలాగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ లోని ఎమోషన్స్ కానీ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా తెరకెక్కించాడు గురూజీ. ఇక మెగాస్టార్ మరియు ఇతర స్టార్ హీరోల సాంగ్స్ కు బన్నీ స్టెప్పులు వేసే ఎపిసోడ్ చాలా బాగుంది. కామెడీ, ఎమోషన్స్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఇక పూజా ఒక్క గ్లామర్ తోనే కాకుండా మరోసారి మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే మురళీ శర్మ మంచి పాత్ర పోషించారు. టబు,జైరాం రోహిణీ లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే నివేత పేతురాజ్ మరియు సుషాంత్ లు కూడా మంచి రోల్స్ చేసారు. ఈ సినిమాకి మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ తమన్ అందించిన సంగీతం. బాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అలాగే పి ఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : ప్రధానమైన మైనస్ పాయింట్ ఏంటంటే కొత్త కథను తీసుకోకపోవడం. సినిమా తాలూకా ప్రధాన ప్రతిబింబాన్ని ఎప్పటిదో సినిమా నుంచి తీసుకున్నదే. కొన్ని పాత్రలు సినిమాలో కనిపించిన అవి పెద్దగా సినిమాకు ఉపయోగపడవు. అలానే సెకండాఫ్ లో నిడివిడి ఎక్కువైంది.

మొత్తంగా : బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో హీరోయిన్స్ రొమాన్స్ అన్ని కుదిరాయి. అయితే కథకు సంబంధించిన పాయింట్ ను మాత్రం నిరాశ పరిచే పాయింట్. తెలిసిన కథనే కొత్తగా తీశాడు. ఇది తప్పిస్తే పెద్దగా మైనస్ లు లేవు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -