Saturday, April 27, 2024
- Advertisement -

నరేష్ లో ఆ మార్పుకి కారణం తన తండ్రేనట

- Advertisement -

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి తనయుడిగా మాత్రమే కాక అల్లరినరేష్ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఇంతకు ముందు వరకు నరేష్ కి కొన్ని చెడు అలవాటు ఉండేవట. సెట్ కి ఎప్పుడు లేటుగా వెళుతూ వుండేవాడట. అతని వల్ల ప్రొడ్యూసర్లు మరియు నిర్మాతలు చాలా ఇబ్బందులు పడే వాళ్ళని సమాచారం. అయితే నరేష్ ఇప్పుడు మారిపోయారట. దానికి కారణం తన తండ్రి అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు అల్లరి నరేష్.

ఒకరోజు ఈవివి సత్యనారాయణగారు నరేష్ తో షూటింగ్ సెట్స్ కి ఎప్పుడు టైం కి వెళ్లాలని ఒకవేళ గనుక లేట్ గా వెళ్లే చెడు అలవాటు ని నరేష్ మానుకోకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారట. దీంతో అల్లరి నరేష్ తన అలవాటును మానుకుని షూటింగ్ సెట్స్ కి టైం కి వెళ్ళటం నేర్చుకున్నారట. అంతేకాకుండా ఒకప్పుడు నరేష్ ఒకే ఒక రోజులో రెండు సినిమాలు షూటింగ్ లు చేసేవాడట. అలా కాకుండా ఈవివి సత్యనారాయణ సూచన మేరకు ఒక కాల్ షీట్ పూర్తయిన తర్వాతనే మరొకటి ఇవ్వడం వంటివి ఆ రెండు కాల్షీట్ల మధ్యలో గ్యాప్ ఉంచుకోవడం వంటివి నేర్చుకున్నారట. “మా నాన్నగారి హెచ్చరిక వల్ల నేను చాలా మారిపోయాను” అని అన్నారు అల్లరి నరేష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -