Friday, April 26, 2024
- Advertisement -

అల్లరి నరేష్ ఇంట విషాదం

- Advertisement -

అల్లరి నరేష్ ఈ మధ్య వచ్చిన మహర్షి సినిమా తో చివరికి దారిలో పడ్డట్లు తెలుస్తుంది. సినిమా లో తను పోషించిన రవి అనే పాత్ర నరేష్ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సినిమా విజయం తో అందరూ సంతోషం గా ఉన్నారు. ఒక పక్క మహేష్ విహార యాత్ర లో సరదాగా గడుపుతుండగా, నిర్మాతలు సినిమా కి వస్తున్న లాభాలని లెక్క పెట్టుకుంటున్నారు. అయితే అల్లరి నరేష్ కూడా సంతోషం గా ఉన్న ఈ తరుణం లో ఆయన ఇంట అనుకోని విషాదం నెలకొంది.

నరేష్ నానమ్మ ఈదర వెంకటరత్నమ్మ గారు కాలం చెందారు. ఆవిడ కన్ను మూసే సమయానికి ఆమె వయసు 87. 2011 లో నరేష్ తండ్రి ఈ.వి.వి సత్యనారాయణ మరణించినప్పటి నుంచి ఆవిడ తన స్వగ్రామం నిడదవోలు దగ్గరి కోరుమామిడి లో నివసించడం మొదలు పెట్టారు. అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చి తన పిల్లల తో గడుపుతూ ఉండేవారు. గత కొన్ని రోజులు గా ఆవిడ వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల తో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది.

ఆవిడకి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. నిన్న సాయంత్రం ఆవిడ అంత్యక్రియలు స్వగ్రామం లో ముగిసాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -