Friday, April 26, 2024
- Advertisement -

మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో

- Advertisement -

టాలీవుడ్ లోని స్టార్ దర్శకులలో మురగదాస్ కూడా ఒకరు. తమిళంలో సూపర్ హిట్ సినిమాలను అందించిన మురుగదాస్ తెలుగులో మాత్రం ఒక్క హిట్ కూడా అందుకోలేక పోయారు. ముందుగా చిరంజీవి హీరోగా ‘స్టాలిన్’ సినిమాకి దర్శకత్వం వహించారు కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ అది కూడా డిజాస్టర్ గా మారింది. అయితే తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. లింగుస్వామి దర్శకత్వం లో సినిమా అనుకున్నారు కానీ అది వర్కవుట్ అవ్వలేదు. తాజాగా ఇప్పుడు మురుగదాస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని బన్నీ ప్లాన్.

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ‘అల వైకుంఠ పురంలో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ మరియు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా బన్నీ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత మురుగదాస్ తో బన్నీ సినిమా చేస్తాడు. అయితే బన్నీ కోసం మురుగదాస్ కనీసం ఏడాదైనా ఎదురు చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిదాకా మురుగదాస్ దర్శకత్వంలో ఒక్క తెలుగు హీరో కూడా హిట్ అందుకున్న దాఖలాలు లేవు. మరి అలాంటిది బన్నీ మురుగదాస్ తో సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -