Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లికి ముందు ఉన్న‌ట్లు ఇప్పుడు లేదంటున్న హీరో

- Advertisement -

ఈ మ‌ధ్య హీరో, హీరోయిన్లు ఎక్కువుగా విడాకులు తీసుకున్నంట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ స్టార్లు త‌మ భార్య , భ‌ర్తల‌కు విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తున్నారు. తాజాగా మ‌రో హీరో త‌మ దాంప‌త్య జీవితానికి స్వ‌స్థి చెప్పాడు. బాలీవుడ్ న‌టుడు అరుణోదయ్ సింగ్ తన భార్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. బాలీవుడ్ శృంగార తార స‌న్ని లీయోన్ న‌టించిన జిస్మ్ -2 సినిమాలో న‌టుడుగా ప‌రిచియం అయ్యాడు అరుణోదయ్ సింగ్ . ఈ సినిమా త‌రువాత బాలీవుడ్ సినిమాల్లో న‌టించి మెప్పించాడు. ఈ హీరో తన భార్య లీ ఎల్టన్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. లీ ఎల్టన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2016లో లీ ఎల్టన్ వివాహం ఆడాడు అరుణోదయ్ సింగ్.

అయితే పెళ్లి త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు రావ‌డంతోనే వీరిద్ద‌రు విడిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని అరుణోదయ్ సింగ్ స్యయంగా చెప్ప‌డం విశేషం. పెళ్లికి ముందు మా మ‌ధ్య ఉన్న సంతోషం ఇప్పుడు లేద‌ని చెప్పుకొచ్చాడు. పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశామని చెప్పుకొచ్చారు. కాని అవి ఏమి ఫ‌లితం చూపించ‌లేద‌ని తెలిపాడు. ఒక విడిపోవ‌డ‌మే ఇద్ద‌రికి మంచిద‌ని, ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని సోష‌ల్ మీడియాలో తెలియజేశాడు. ఐసా, యే సాలీ జిందగీ, మై తెరా హీరో, బుద్దా ఇన్ ఏ ట్రాఫిక్, మహెంజదారో, బ్లాక్ మెయిల్ వంటి సినిమాల్లో న‌టించ‌డం ద్వారా అరుణోదయ్ సింగ్ బాలీవుడ్‌లో బాగా ఫేమ‌స్ అయ్యాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -