బిగ్‌బాస్ లో గాయపడిన అవినాష్.. ఏం జరిగింది ?

543
bigg boss telugu season 4 jabardasth avinash injured in the killer coin points task
bigg boss telugu season 4 jabardasth avinash injured in the killer coin points task

బిగ్‌బాస్ హౌస్‌లో 24వ రోజు కిల్లర్ కాయిన్ పాయింట్స్ కొనసాగింది. కాయిన్స్ సొంతం చేసుకునేందుకు హౌస్ మెంట్స్ ఆసక్తి ఆడారు. సోయల్, మెహబూబ్ ఇంటి సభ్యులు నిద్రపోతే వారి కాయిన్స్ దొంగిలించే ప్రయత్నం చేశారు. అలా కాయిన్స్ దొంగలించినందుకు ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సోహైల్, అమ్మా రాజశేఖర్ మాస్టర్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

తన కాయిన్స్‌ దొంగిలించడంపై సోహైల్‌పై అమ్మా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. ఆడురా నీ ఆట.. నీవు ఎలా గెలుస్తావో చూస్తా. ఇంత కష్టపడి కాయిన్స్ సంపాదిస్తే కొట్టేస్తారా? అని రాజశేఖర్ కామెంట్స్ చేశారు. కిల్లర్ కాయిన్స్ గేమ్ ఫస్ట్ లెవెల్ ముగిసిన తర్వాత కాయిన్స్‌ లెక్క చెప్పమని అడుగగా.. అత్యధికంగా మెహబూబ్ 4వ పాయింట్లు, ఆ తర్వాత సోహైల్ అత్యధిక పాయింట్లు సాధించారు.

ఆ తర్వాత రెండో లేవల్ లో మరో వెల్ ప్రో కిల్లర్ కాయిన్ ఇచ్చి దానిని ఎవరిపైకి విసిరాలి. అది ఎవరికైనా అతుక్కుపోతే వారి సగం అంటే 50 శాతం కాయిన్స్ విసిరిన వ్యక్తికి వెళ్లిపోతాయి అని గేమ్ రూల్ చెప్పారు. ఈ నేపథ్యంలో మొనాల్ తీవ్ర మనస్తాపానికి లోనైంది. కిల్లింగ్ కాయిన్ రెండో లెవెల్ ఆడుతున్న సమయంలో అవినాష్ పడిపోయాడు. అవినాష్ గాయం కావడంతో ఇంటి సభ్యులు అతడికి చికిత్స అందించాలని బిగ్‌బాస్‌కు సూచించారు. ఆ తర్వాత అవినాష్‌ను మెడికల్ రూమ్‌కు తీసుకొని వెళ్లారు.

బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్.. చెప్పుతో కొట్టాలి : కళ్యాణి

బాలు ఆస్పత్రి ఖర్చు ఎంతైంది.. వివాదం చెలరేగింది..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని లెక్క చేయని ప్రభాస్ ఫ్యాన్స్..?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షిదీక్షిత్ హౌస్ ఎవరికి పడిపోయిందంటే ?

Loading...