మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన బాలీవుడ్ హీరోయిన్‌….

231
Bollywood actress Sameera Reddy blessed with baby girl
Bollywood actress Sameera Reddy blessed with baby girl

గత కొన్నిరోజులుగా బేబీ బంప్ ఫోటోలు పెడుతూ వార్తల్లోకెక్కిన హీరోయిన్ సమీరా రెడ్డి ఈరోజు ఉదయం ఆడబిడ్డకు జన్మినిచ్చింది. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ ఉదయం ప్రసవించింది. తన అరచేతిలో ఇమిడిపోయిన క్యూట్ కిడ్ చేతి వేళ్లను ఫోటోలు తీసి వాటిని అభిమానులకు షేర్ చేసారు. నేటి ఉదయమే లిటిల్ యాంజెల్ జన్మించింది. మీ ప్రేమ.. ఆశీస్సులకు ధన్యవాదాలు అని సమీరా సంతోషం వ్యక్తం చేశారు.సమీరా రెడ్డి- అక్షయ్ వార్దే జంట ప్రస్తుతం ఈ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు

2014లో అక్షయ్ వార్దేను ఆమె పెళ్లాడింది. వివాహానంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. 2015లో ఈ జంటకు మగబిడ్డ పుట్టాడు. తాజాగా ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది స‌మీరారెడ్డి.

Loading...