Friday, April 26, 2024
- Advertisement -

ట్రైలర్ తో అందరి దృష్టి ఆకర్షిస్తున్న గోపిచంద్

- Advertisement -

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న గోపీచంద్ ఈ మధ్యనే ‘పంతం’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్నారు. తాజాగా తమిళ దర్శకుడు తిరు తో చేతులు కలిపిన గోపీచంద్ ఈసారి ‘చాణక్య’ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాలో గోపీచంద్ తో రొమాన్స్ చేసిన మెహరీన్ పిర్జాదా ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమాలో గోపీచంద్ బ్యాంక్ ఎంప్లాయి గా కనిపించినప్పటికీ అండర్ కవర్ లో ఉన్న ఒక రా ఏజెంట్ అని తెలుస్తోంది.

అయితే గోపీచంద్ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు ఉంటాయి. వీటి నుంచి గోపీచందు ఎలా బయటకు వచ్చాడు, టెర్రరిస్టులు ఆట ఎలా కట్టించాడు అనేది సినిమా కథ అని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మరి ఈ సినిమాతో నైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘గూడచారి’, ‘ఎవరు’ ఫిలిం శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -