Saturday, April 27, 2024
- Advertisement -

‘సాహో’ పై పుకార్లు నిజమేనా?

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమా ‘సాహో’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులే కాక సినిమా ప్రియులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 30 న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి.

నిజానికి ‘సాహో’ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్, నెట్ఫ్లిక్స్, జీ5, హాట్స్టార్ వంటి అన్ని ఓ టి టి ప్లాట్ ఫామ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కానీ వీటన్నిటిలోనూ అమెజాన్ ప్రైమ్ వారు ‘సాహో’ సినిమా తెలుగు, తమిళ మరియు మలయాళం డిజిటల్ రైట్స్ ను 42 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజా నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ‘సాహో’ సినిమా ఆల్ టైం రికార్డ్ సృష్టించినట్టే. మరోవైపు భారీ అంచనాల మధ్య ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -