Thursday, April 18, 2024
- Advertisement -

కష్టాల్లో నెట్ ఫ్లిక్స్ ..గట్టెక్కేనా ?

- Advertisement -

కరోనా కు ముందు ఓటిటీ ప్లాట్ ఫామ్ పై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరిచే వారు కాదు. కానీ 2019 లో ఎంట్రీ ఇచ్చిన కరోనా తరువాత ఓటిటీ ప్లాట్ ఫామ్ కు బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో థియేటర్లు మూతపడడంతో వినోదం కొరకు ప్రజలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ వైపు మొగ్గు చూపారు. కొంత అమౌంట్ కట్టి నెల సబ్ స్క్రిబ్శన్ లేదా సంవత్సరం సబ్ స్క్రిబ్షన్ తీసుకొని అన్నీ భాషల మూవీస్ తో పాటు వెబ్ సిరీస్, ప్రోగ్రామ్స్ వంటి వాటిని చూసేందుకు వీలు కల్పించాయి ఓటిటీ సంస్థలు.

దాంతో వినోద ప్రియులు ఓటిటీ కంటెంట్ కు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఆ విధంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, ఆహా వంటి ఎన్నో డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్నాయి. అయితే వీటన్నిటిలో మొదటి నుంచి కూడా నెట్ ఫ్లిక్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే మొదటినుంచి వీడియో స్ట్రీమింగ్ సంస్థలలో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ సంస్థకు ఇప్పుడు ఇతర సంస్థలైన అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, జి 5. వంటి వాటితో గట్టి పోటీ ఎదురవుతుంది.

ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ నుంచి భారీగా సబ్ స్క్రైబర్లు వైదొలుగుతున్నారు. ఈ ఏడాది ఏప్రెల్ నుంచి జులై మద్య కాలంలో దాదాపుగా 10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయినట్లుగా ఆ సంస్థ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ చెప్పుకొచ్చారు. 2011 తరువాత మరోసారి ఇంతమొత్తంలో సబ్ స్క్రైబర్లను కోల్పోవడం ఈ ఏడాదే జరిగిందని ఆయన తెలిపారు. దాంతో ఆ సంస్థ షేర్ వీలుగా 60 శాతానికి పడిపోయింది. దీంతో నష్టాలను భర్తీ చేసేందుకు.. ఆ సంస్థలోని ఎంతోమంది ఉద్యోగులను తీసివేసిందట. మరి ఈ నష్టాల నుంచి నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు గట్టెక్కుతుందో చూడాలి.

More Like This

నథింగ్ ఫోన్ లో ధూళి కణాలు.. మళ్ళీ కాంట్రవర్సీ !

క్రిప్టో కరెన్సీ బ్యాన్.. సాధ్యం కదా ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -