దిల్ రాజు కూడా ఆ హీరోయిన్ మోజులో ప‌డ్డాడా..?

258
Dil raju selected heroine rashmika his next movie
Dil raju selected heroine rashmika his next movie

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ల‌లో దిల్ రాజు కూడా ఒక‌రు. చాలా సెలెక్టివ్‌గా సినిమాల‌ను చేస్తు మంచి అభిరుచి గ‌ల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నాడు. త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోల‌కు, హీరోయిన్ల‌కు హిట్లు ఇచ్చిన ఘ‌న‌త దిల్ రాజుది. అలాంటి దిల్ రాజు ఓ హీరోయిన్‌పై మోజు ప‌డ్డాడ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మోజు అంటే వేరేలా అర్థం చేసుకోకండి.. ఇక్క‌డ మోజు అంటే త‌న సినిమాలో ఆ హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నాడ‌ని అర్థం.

ఇంత‌కి ఆ హీరోయిన్ ఎవ‌రా అని అనుకుంటున్నారా..? అదేనండీ మ‌న గీతా గోవిందం హీరోయిన్ ర‌ష్మిక‌నే. తెలుగులో ర‌ష్మిక‌కు చాలా డిమాండ్ ఉంది. ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన గీతా గోవిందం ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు సైతం ర‌ష్మిక‌తో న‌టించాడానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దిల్ రాజు కూడా వ‌చ్చి చేరారు. తాను నిర్మించ‌బోయే సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మ‌క‌ను తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట దిల్ రాజు. ఈ సినిమాలో హీరోగా నాగ‌చైత‌న్య హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని స‌మాచారం. ర‌ష్మిక మొత్త‌నికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచిగానే ప్లాన్ వేసింద‌ని అంటున్నారు ఆమె అభిమానులు.