విజయ్ కోసం నిర్మాతల కి తప్పట్లేదు.

180
Directors and Producers Are Waiting for Vijay Devarakonda
Directors and Producers Are Waiting for Vijay Devarakonda

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ లో వరుస విజయాల తో దూసుకుపోతున్న నటుల్లో ముందు స్థానం లో ఉన్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు అనే సినిమా తో విజయం సాధించి అర్జున్ రెడ్డి తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని గీత గోవిందం తో తిరుగులేని ప్రయాణాన్ని సాగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఇతని డేట్స్ కోసం చాలా మంది నిర్మాతలు వేచి చూస్తున్నారు.

ఇప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత గోవిందం మరియు టాక్సీ వాల చేసిన విజయ్ దేవరకొండ ఇమ్మిడియట్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో డియర్ కామ్రేడ్ సినిమా ను ఒప్పుకున్నాడు. ఇప్పుడు త్వరలో రాబోతున్న హీరో అనే సినిమా కూడా ఈ సంస్థలోనే నిర్మించబడుతుంది.

ఆసక్తికర విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ ఏ నిర్మాణ సంస్థ లోకి అడుగు పెట్టినా అక్కడ రెండు సినిమాలు చేసి కానీ బయటకి రావడం లేదు. దీని వల్ల ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన నిర్మాతలు అనుకున్న సమయం కంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్తితి వచ్చింది. కె ఎస్ రామ రావు కూడా ఎప్పటినుండో విజయ్ దేవరకొండ తో సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ కమిట్మెంట్ వల్ల కాస్త ఆలస్యం గా క్రాంతి మాధవ్ సినిమా మొదలు పెట్టాల్సి వచ్చింది. అయితే ఇంకొంత మంది నిర్మాతలు విజయ్ తో సినిమాలు నిర్మించడానికి తయారు గా ఉన్నా కానీ విజయ్ యొక్క థాట్ ప్రొసెస్ వారు క్యాచ్ చేయలేక వేచి ఉండక తప్పడం లేదు.

Loading...