‘దృశ్యం’లో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయింది..!

1227
Drushyam Child Artist Esther Anil Has Become More Beautiful
Drushyam Child Artist Esther Anil Has Become More Beautiful

చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు ఉన్నారు. తరుణ్, అఖిల్, అంకిత, శ్రియా శర్మ, నాగ అన్వేష్, షామిలి, సుహాని, ఆకాష్ పూరి, మహేంద్రన్, తేజ సజ్జ, బాలాదిత్య, మనోజ్ నందన్, శ్రావ్య, తనీష్, నిత్యాశెట్టి ఇలా చాలా మంది బాల నటులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోలు, హీరోయిన్స్ అయ్యారు.

చైల్డ్ ఆర్టిస్టులుగా అదరగొట్టిన చాలా మంది లీడ్ యాక్టర్స్ గా రాణించలేకపోయారు. ఇదిలా ఉంటే, మరో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 2014లో వచ్చిన ‘దృశ్యం’ సినిమాలో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు అనుగా నటించిన ఎస్తర్ అనిల్.. ‘జోహార్’ అనే తెలుగు సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ మలయాళీ పాప 15 ఏళ్ల వయసులోనే ఉత్తమ వర్ధమాన నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమాలో ఎస్తర్ నటించింది. అదే సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేశారు.

ఈ రెండు చిత్రాల్లోనూ అను పాత్రను ఎస్తరే పోషించింది. ఎస్తర్ స్వస్థలం కేరళలోని వయానాడ్. ‘దృశ్యం’ సినిమాలో చాలా చక్కగా.. అమయకంగా నటించింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. 2010లో వచ్చిన ‘అజి జాన్’ అనే మలయాళం చిత్రం ద్వారా ఎస్తర్ అనిల్ పరిచయం అయింది. ఆ తర్వాత ‘ఒరు నాల్ వరుమ్’, ‘దృశ్యం’, ‘పాపనాసం’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రౌడీ’, ‘ఊలు అండ్ జాక్’, ‘జిల్’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు తెలుగు సినిమా ‘జోహార్’ ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌‌కు తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ సూర్య పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ మర్ని నిర్మిస్తున్నారు.

View this post on Instagram

🌥

A post shared by Esther Anil (@_estheranil) on

View this post on Instagram

🌼nam.

A post shared by Esther Anil (@_estheranil) on

View this post on Instagram

Hello again. 📸💃 @_the_invictus_

A post shared by Esther Anil (@_estheranil) on

మరో యాంకర్ ని ఆకాశానికి ఎత్తిన వర్మ.. చూస్తే షాక్..!

స్నానం చేస్తుండగా వీడియో.. అత్యాచారం : సింగర్ చిన్మయి ఫైర్

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్..!

Loading...