Friday, April 26, 2024
- Advertisement -

ఊహ మేన‌మామ ఎంత గొప్ప సినీ ర‌చ‌యితో తెలుసా…?

- Advertisement -

నటుడు శ్రీకాంత్ భార్య ఊహ అని అంద‌రికీతెలుసు. కాని ఊహ అస‌లు పేరు శివ‌రంజ‌ని అని కొంద‌రికే తెలుసు. ఇవివి సత్యనారాయణ డైరక్షన్లో వచ్చిన ఆమె అనే సినిమాలో శివరంజని పేరు కాస్తా, ఊహగా మార్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమానే ఇద్ద‌రిని ఒక్క‌టి చేసింది.

తెలుగులో మొద‌టి సినిమా ఆమె. ఆ సినిమాలో శ్రీకాంత్‌, ఊహ న‌టించారు. అప్పటిదాక సినీరంగానికే పరిచయం లేని ఫ్యామిలీ అనుకుంటారు. కానీ ఆమె మేన‌మాక తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంత పెద్ద‌ర‌చ‌యిత‌, అభ్యుద‌య సినిమాల‌కు సంభాష‌ణ‌లు కూడా అందించారు. ఆయ‌న ఎవ‌రో కాదు పిఎల్ నారాయ‌ణ‌.

స్వతహాగా మలయాళీ అయిన పిఎల్ నారాయణ తెలుగువారిగానే పెరిగారు. గుంటూరు జిల్లా బాపట్ల ఆయన జన్మస్థలం కాగా..అక్కడివారితో ఆయన అనుబంధం ఎంతో ముడిపడి ఉంది. రుద్రవీణ, నంబర్ వన్, కర్తవ్యం, నేటి భారతం, రేపటి పౌరులు, మయూరి వంటి సినిమాల్లో ఆయన నటన గుర్తుండిపోతుంది. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాకి ఆయన మాటలు రాశారు.

టి.కృష్ణ సినిమాల్లో ఆయనకి ఖచ్చితంగా ఓ రోల్ ఉండేది. కార్మికనేత, లాయర్, బడిపంతులు, తాగుబోతు, బెగ్గర్ ఇలా ఏక్యారెక్టరైనా ఆయనే చేసేవారు. అలాంటి పిఎల్ నారాయణ మేన కోడలే ఈ ఊహ. అందుకే సినిమారంగంలోని వ్యక్తిని పెళ్లాడతామన్నా ఊహ కుటుంబంలో అంగీకారం వెంటనే దొరకగలిగింది.పెళ్లైన తర్వాత మాత్రం కుటుంబానికే అంకితమైపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -