Friday, April 26, 2024
- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ రికార్డులు బద్దలు కొట్టిన కబీర్ సింగ్

- Advertisement -

2017 లో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకి హిందీ రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వడం విశేషం. మొదట్లో ‘అర్జున్ రెడ్డి’ లాంటి కల్ట్ సినిమాకి రీమేక్ అంటే బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందా లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్జ్’ సినిమా మొదటి రెండు రోజులు వరుసగా 20 కోట్ల మార్క్ ను దాటుతూ వచ్చింది.

మొదటిరోజు కబీర్ సింగ్ 20.21 కోట్లను నమోదుచేయగా, రెండవ రోజు కూడా కలెక్షన్లు 21 నుంచి 22 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా లైఫ్ టైం లో బాక్సాఫీస్ వద్ద 49 కోట్లను నమోదు చేసుకుంది. కానీ అదే సినిమాకి రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ సినిమా మొదటి రెండు రోజుల్లోనే 42 కోట్లను సంపాదించటం ట్రేడ్ వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈ సినిమా ఖచ్చితంగా 50 కోట్ల మార్క్ ను దాటేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రెండు బ్లాక్ బస్టర్ లతో సార్ డైరెక్టర్గా మారిపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -