పూరి సినిమానే నమ్ముకున్న కన్నడ బ్యూటీ

168
Kannada beauty Nabha Natesh who believes Puri movie iSmart Shankar
Kannada beauty Nabha Natesh who believes Puri movie iSmart Shankar

తెలుగు సినిమా పరిశ్రమ లో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు స్టార్డం అని అనుభవించే స్థాయి కి చాలా మందే వెళ్లారు. ఆయన తో పని చేసాక బ్రేక్ వచ్చిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అందుకే పూరి సినిమాల్లో హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో, హీరోయిన్ల కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా లో కూడా హీరోయిన్ల విషయం లో అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమా తో పరిచయం అయినా కన్నడ బ్యూటీ నభ నటేష్, అలాగే నిధి అగర్వాల్ ఈ సినిమా లో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

నిధి అగర్వాల్ కి అవకాశాలు బాగానే ఉన్నా నభ కి మాత్రం ఈ సినిమా విజయం సాధిస్తే బాగా హెల్ప్ అవుతుంది. తను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ అందరినీ ఎంతగానో అలరించింది. పూరి కూడా ఈ సినిమా లో నభ పాత్ర కె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట. ఎలాగైనా ఈ సినిమా విజయం సాధించాలని నభ కోరుకుంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా నభ ఆశల్ని పెంచుతుందా లేదా వాటి మీద నీళ్లు చెల్లుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Loading...