Friday, April 26, 2024
- Advertisement -

90 ఎంఎల్ టీజర్ లో తాగుబోతుగా కార్తికేయ

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ వంటి బోల్డ్ సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ రొమాంటిక్ ఎంటర్టైనర్ అయిన ‘హిప్పీ’ తో మాత్రం మంచి విజయాన్ని సాధించలేదు. తాజాగా నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించి, కార్తికేయ ఇప్పుడు మళ్లీ హీరోగా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా తో మన ముందుకి రాబోతున్నాడు. ’90 ఎం ఎల్’ అనే ఆసక్తికరమైన టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసిన దర్శక నిర్మాతలు తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేసారు.

కార్తికేయ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక తాగుబోతు పాత్రలో కార్తికేయ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీజర్ చూస్తే ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. సినిమాలోని డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -