`సరిలేరు నీకెవ్వరు` వంద కోట్లు.. ఇది మహేష్ స్టామినా..!

496
mahesh babu's sarileru neekevvaru day 5 box office collections
mahesh babu's sarileru neekevvaru day 5 box office collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ సరిలేరు నీకెవ్వరు. మహేష్‌కు జోడిగా రష్మిక నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే హిట్ టాక్ రావటంతో ఈ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్‌ల దిశగా వెళ్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ తొలి రోజే సత్తా చాటింది.

ఫస్ట్ డే 46.77 కోట్ల వసూళ్లు సాధించింది. దాదాపు తొలి రోజు 90 కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండో రోజుఈ సినిమా కేవలం 13 కోట్ల షేర్‌ మాత్రమే సాధించగలిగింది. మూడో రోజు కూడా అదే స్థాయిలో డ్రాప్‌ కనిపించింది. థర్డ్‌ డే కేవలం 9 కోట్లతో సరిపెట్టుకుంది సరిలేరు నీకెవ్వరు. తెలుగు రాష్ట్రాల్లో ఐదురోజుల్లో 68.22 కోట్ల షేర్‌ సాధించింది. వరల్డ్‌ వైడ్‌గా చూసుకుంటే ఈ లెక్క దాదాపు 86 కోట్లు వరకు ఉంటుందని అంచన వేస్తున్నారు.

తొలి వారంలో ఈ సినిమా వంద కోట్ల షేర్‌ మార్క్‌ను ఈజీగా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఈస్ట్, వైజాగ్‌, గుంటూరులలో బ్రేక్‌ ఈవెన్‌ అయిన సరిలేరు నీకెవ్వరు, చాలా చోట్ల నాన్‌ బాహుబలి 2 రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రకు సీనియర్‌ నటి విజయశాంతిని తీసుకోవటం సినిమా ప్లస్ అయ్యింది. సంగీత, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌ తమ వంతు పాత్ర పోషించి సినిమా సక్సెస్ కు కారణం అయ్యారు.

Loading...