Friday, April 26, 2024
- Advertisement -

బాలీవుడ్ ప్రేమ జంటకు కరోనా…షాక్ లో ఇండస్ట్రీ..!!

- Advertisement -

కరోనా మహమ్మారి రోజు రోజు విస్తరిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ లో ఈ మహమ్మారి పెద్ద పెద్ద వారిని ఎవరినీ వదలతేడు.. తాజాగా అర్జున్ కపూర్, నటి మలైకా అరోరా లకు ఈ వైరస్ సోకింది.. కరోనా సోకిన విషయాన్ని బాధ్యతగా వెల్లడిస్తున్నట్టు చెప్పిన అర్జున్ కపూర్ వెల్లడించాడు..

నలో ఎటువంటి లక్షణాలు లేవని, బాగానే ఉన్నానని పేర్కొన్న అర్జున్ కపూర్.. తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేయడం బాధ్యతగా భావించి వెల్లడించినట్టు ట్వీట్ చేశాడు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నాడు.

తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తుంటానని చెప్పాడు. వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని, క్షేమంగా బయటపడతామని నమ్ముతున్నట్టు పేర్కొన్నాడు. మరోవైపు, అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాకు కూడా కరోనా సోకినట్టు ఆమె సోదరి అమృతా అరోరా తెలియజేసింది. కాగా, అర్జున్ కపూర్, మలైకాలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -