Friday, April 26, 2024
- Advertisement -

ప్రేమ‌లో ప‌డ్డ బాలీవుడ్ హీరోయిన్‌..ఆ బాధితుడు ఎవ‌రో…?

- Advertisement -

బాలీవుడ్ లో పెళ్లిల్లు, స‌హ‌జీవ‌నాలు, విడాకులు స‌ర్వసారాధ‌నం. హీరోయిన్‌లు హీరోల‌తో డేటింగ్ చేయ‌డం త‌ర్వాత విడిపోవ‌డం ఒక‌రి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం మామూలే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటె మొద‌ట గుర్తుకొచ్చేంది కంగ‌నా ర‌నౌత్‌. మంచి తనం ఎంత ఉందొ మొండితనం కూడా అదే రేంజ్ లో ఉందంటూ ప్రతి విషయంలో వేలుపెడుతూ రచ్చ చేయడం…వార్త‌ల్లో ఉండ‌టం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నైజం.

రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ బోలెడు ప్రేమకథల్ని నడిపి బ్రేకప్‌‌లతో రచ్చ చేసిన మణికర్ణిక మళ్లీ ఇప్పుడు కొత్త ప్రేమ కథకు ట్రాక్ వేసుకుందట. హృతిక్ రోష‌న్‌, అధ్యాయన్ సుమన్, ఆదిత్య పంచోలిలతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పేసిన కంగనా మరోసారి ప్రేమలో పడిందట. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని ఓపెన్‌గా చెప్పింది. తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని తెలిపింది. తనకు స్ఫూర్తిగా నిలిచే ఒక తోడు కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. ప్రేమికుని పేరు మాత్రం సీక్రెట్‌గా ఉంచింది.ఎవర్ని ప్రేమించినా సహజీవనానికి మాత్రం దూరం అంటోంది. అయితే ఆ బాధితుడు ఎవరా అని చెవులు కొరుక్కొంటున్నారు బాలీవుడ్ జనాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -