Friday, April 26, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేరిన నాగ‌బాబు

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న గ‌త‌కొంత‌కాలంగా త‌న త‌మ్ముడు పార్టీకి మ‌ద్దుతుగా యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. నాగబాబు పార్టీలో చేరిన‌ట్లు జ‌న‌సేన పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో నాగ‌బాబు పార్టీలో చేరారు. అన్న నాగ‌బాబుకు పార్టీ కండువా క‌ప్పిమ‌రి పార్టీలోకి ఆహ్వానించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని పార్టీ వెల్లడించింది. నాగ‌బాబు జ‌న‌సేన‌లో చేర‌తార‌ని మొద‌టి నుంచి అంద‌రు భావించారు. అంద‌రు అనుకున్న‌ట్లుగానే ఆయ‌న పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంట‌నే ఆయ‌నకు పార్టీ టికెట్ కేటాయించ‌డం విశేషం. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తాను దూరం అని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇప్పుడు త‌న అన్న‌ను పార్టీలో చేర్చుకుని ఎటువంటి రాజ‌కీయాలు చేయాలని అనుకుంటున్నారో చెప్పాల‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ప్ర‌శ్నిస్తున్నాయి.

త‌న మ‌రో అన్న‌య్య చిరంజీవిని కూడా పార్టీలో చేర్చుకుని జ‌న‌సేన పార్టీని కూడా మ‌రో ప్ర‌జ‌రాజ్యం పార్టీలా మార్చేయండి అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ కూడా త‌న అన్న‌కు మాదిరిగానే రెండు చోట్ల పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైజాగ్ గాజువాక అసెంబ్లీ , ప‌శ్చిమ గోదావరి జిల్లా భీమవ‌రం అసెంబ్లీ నియోజిక వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. మ‌రి ఈ రెండు స్థానాల్లో ప‌వ‌న్ ఎక్క‌డ విజ‌యం సాధిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -