నాకే రోగం లేదు.. సాయి ధరమ్ తేజ్ కామెంట్స్..!

744
mega hero sai dharam tej about his character in prathi roju pandage
mega hero sai dharam tej about his character in prathi roju pandage

మెగా కుంటుంబం నుంచి హీరోగా వచ్చి.. తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాధించుకున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్ లు కొట్టిన ఈ హీరో తర్వాత వరస ప్లాప్ లు చూశాడు. దాంతో అతని కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడిందని చెప్పాలి. అందుకే ప్రస్తుతం కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం కామెడీ సినిమాల డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్రపై రకరకల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మారుతి చిత్రాల్లో హీరోలకు ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్య ఉంటుంది. ఆ సమస్య నుంచి కామెడీ ని జనరేట్ చేస్తాడు మారుతి. భలే భలే మొగాడివోయ్ సినిమాలో నాని మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటాడు.

బాబు బంగారంలో వెంకటేష్ మంచి తనం.. మహానుభావుడు సినిమాలో శర్వానంద్ ఓసీడీ తో ఇబ్బంది పడుతుంటాడు. ఇలా తన చిత్రాల్లో ఒక్కో హీరోకు ఒక్కో రోగాన్ని అంటగట్టేసిన మారుతి.. ఇక ప్రతి రోజు పండగే సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు ఏ రోగం ఉన్నట్లుగా చూపిస్తాడో అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు.

ఈ చిత్రంలో తన పాత్రకు ఎలాంటి రోగం ఉండదని.. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందని చెప్పాడు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రావూ రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. తమన్ సంగీతం అందించారు. డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Loading...