Saturday, April 27, 2024
- Advertisement -

బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరు..!

- Advertisement -

యాంకర్స్ లో బిత్తిరి సత్తిది డిఫరెంట్ స్టైల్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు ఇతను. తీన్మార్ వార్తల్లో సత్తికి సావిత్రి జోడి. వీరిద్దరూ చెప్పే వార్తలు గమ్మతుగా ఉంటాయి. సావిత్రి అంటే ఎవరో కాదు ఇటీవలే బిగ్ బాస్ 3 లో పాల్గొన్న శివజ్యోతి. తీన్మార్ వార్తలను వదిలిపెట్టి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు.

కానీ వీరిద్దరూ కలిసి చేసిన రోజులను మరోసారి మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేశారు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ పినాలే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి విజేత రాహుల్ కు టైటిల్ ఇచ్చారు. గ్రాండ్ పినాలే ఒక్క ఎత్తు అయితే.. చిరు ఎంట్రీ మరో ఎత్తు. అయన అద్భుతంగా ఉన్నంత సేపు వినోదాన్ని పంచారు. నిజం చెప్పాలంటే ఈ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవే హైలైట్. హౌస్ లో ఎలిమినేట్ అయినా ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ అయన పండించిన కామెడీ ప్రతి ఒక్కర్ని నవ్విస్తుంది.

ఈ నేపథ్యంలో శివ జ్యోతి దగ్గరకు వచ్చే సరికి బిత్తిరి సత్తి స్టైల్ లో చేతి వేళ్లు వంకరగా పెట్టి.. “ఫ” భాషలో మాట్లాడి నవ్వించాడు. చిరు ఒక్కసారిగా బిత్తిరి సత్తిలా మాట్లాడటంతో శివజ్యోతి కూడా షాక్ అయింది. ‘‘తెలంగాణ మొత్తానికి జ్యోతక్క’’ అంటూ చిరంజీవికి శివజ్యోతిని నాగార్జున పరిచయం చేశారు.

‘‘హాయ్ సార్.. బాగున్నారా’’ అని చిరంజీవిని శివజ్యోతి అడగగానే.. ‘‘సాలా బాగున్నాననమ్మా.. సాలా హ్యాఫీగా ఉందమ్మ నిన్ను ఈవాళ కలవటం. ఎంత హ్యాఫీ అంటే ఫప్ఫన్నం తిన్నట్టుంది ఈవాళ’’ అని చిరంజీవి బిత్తిరి సత్తిలా మాట్లాడారు. ఈ సమయంలో అక్కడంతా అరుపులు, కేకలు. శివజ్యోతి అయితే ఆనందంతో గెంతులేసింది.‘‘థాంక్యూ సార్.. నేను నిద్రపోను ఈ రాత్రింక’’ అని శివజ్యోతి సంతోషంగా చెప్పింది. వెంటనే చిరంజీవి ‘‘ఏడవొద్దు’’ అంటూ కామెడీ చేశారు. మొత్తం మీద ఓ పది నిమిషాల పాటు చిరంజీవి బోలెడంత వినోదాన్ని పంచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -