Saturday, April 27, 2024
- Advertisement -

రోజా కిడ్నాప్ చేశార్.. వైరల్ అవుతున్న వీడియో..!

- Advertisement -

రోజా కిడ్నాప్ కావడం ఏంటి అనుకుంటున్నారా ? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. రోజా ప్రస్తుతం జబర్దస్త్ షోకి జడ్జీగా వ్యవహరిస్తూ.. రాజకీయాల్లో కూడా బిజీగా ఉంది. అయితే జబర్దస్త్ లో జడ్జీగా మాత్రమే కాకుండా కొన్నిసార్లు స్కిట్స్ కూడా చేస్తోంది. అందులో కొన్నిసార్లు కామెడీ కోసం అక్కడక్కడా హద్దులు కూడా దాటేస్తుంది రోజా. తన కాల్షీట్స్‌తో పాటు టైమ్‌ను కూడా అన్నిచోట్లా సమానంగా అడ్జస్ట్ చేస్తుంది రోజా.

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్‌లో పర్ఫార్మ్ చేసింది రోజా. అందులో రోజాను కిడ్నాప్ చేసాడు ఆది. ఇక రోజా కూడా సీరియస్ డైలాగ్‌ను కామెడీగా చెప్పేసింది. ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా నన్నే కిడ్నాప్ చేస్తావా అంటూ సీరియస్ అయింది. రోజా. దాంతో ఆది వెంటనే మరో సెటైర్ వేస్తాడు. ఇది శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా స్పూఫ్. అందులో భాగంగానే రోజా కిడ్నాప్ డ్రామా కూడా ఉంటుంది.

కుర్చీలో తాళ్లతో కట్టేసి హై డ్రామా చేసాడు ఆది. మొత్తానికి ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అయితే బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యి ఉండి రోజా ఇలాంటి స్కిట్స్ చేయడం ఎందుకు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజకీయలు వేరు.. ఎంటర్‌టైన్మెంట్ వేరు అంటూ మరికొందరు రోజాకు సపోర్టు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -