Saturday, April 27, 2024
- Advertisement -

నిహారిక పెళ్లి ఎప్పుడో చెప్పిన నాగబాబు..!

- Advertisement -

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడే ముందు కాస్త అలోచించి మాట్లాడుతారు. కానీ నాగబాబు మాత్రం ఉన్న విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. ఎలాంటి మోహమాటలకు పోకుండా తాను ఏం చేప్పాలనుకుంటారో అది చెబుతారు. తాజాగా ఆయన మాట్లాడుతూ నిహారిక పెళ్లిని గురించి ప్రస్తావించారు.

“ప్రస్తుతం నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో నిహారిక వివాహం జరిపించే అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత వరుణ్ తేజ్ కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన ఉంది. వచ్చే ఏడాది చివరిలోగానీ .. 2022 ప్రథమార్థంలోగాని వరుణ్ పెళ్లి జరిపించే ఆలోచన వుంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము.

ప్రస్తుతం పిల్లల పెళ్లిళ్ల బాద్యత నాపై ఉంది. ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతాను. వరుణ్ తేజ్ ను ఐపీఎస్ గా చూడాలనే కోరిక ఉండేది. అలాగే నిహారికను డాక్టర్ గా చూడాలనుకున్నాను. కానీ నా ఇష్టాన్ని వాళ్లపై రుద్దదల్చుకోలేదు. వాళ్లకి నచ్చిన మార్గంలో వెళ్లడానికి నా వంతు సహకారాన్ని అందించాను” అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -