Saturday, April 27, 2024
- Advertisement -

దారుణంగా ఫ్లాప్ అయిన ‘మన్మధుడు 2’

- Advertisement -

ఈ మధ్యనే ‘దేవదాసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘మన్మధుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే నెగటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విడుదల అయ్యాక కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. అనుకున్న విధంగానే ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ విషయాన్ని నాగార్జున మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇలాంటి కథలు జనాలకి ఎక్కడానికి కొంత సమయం పడుతుందని ‘గీతాంజలి’, ‘నిర్ణయం’ వంటి సినిమాలు కూడా విడుదలైన వెంటనే హిట్ అవ్వలేదు అంటూ ఉదాహరణలు చెబుతున్నారు నాగార్జున. కానీ మరోవైపు ‘మన్మధుడు 2’ సినిమాకి విడుదలైన రెండో రోజు నుంచే వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

సోమవారం బక్రీద్ వలన హాలిడే వచ్చినప్పటికి థియేటర్లు ఏమాత్రం ఫుల్ అవ్వకపోవడంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున మరియు చిత్ర బృందం కలిసి టూర్ ప్లాన్ చేసింది కానీ సినిమా ఏమో విడుదలైన రెండు రోజులకే డిజాస్టర్ గా మారిపోయింది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఏమాత్రం బాగుండక పోవడంతో ఇలాంటి సమయంలో టూర్ ప్లాన్ లు దేనికని ఆ ప్లాన్ రద్దు చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఏపీ మరియు నైజాంలో ‘మన్మధుడు 2’ సినిమా 18 కోట్లకు పైగా అమ్ముడవ్వగా కేవలం తొమ్మిది కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరడం అసాధ్యం అని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -