Saturday, April 27, 2024
- Advertisement -

ప్రెగ్నెన్సీతో బికిని అవ‌స‌ర‌మా..?

- Advertisement -

బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి కోలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లో న‌టించింది. త‌మిళ‌, తెలుగు, భాష‌ల్లో న‌టించి బాగానే పాపుల‌ర్ అయింది అమీ జాక్స‌న్‌. ముఖ్యంగా శంక‌ర్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐ, రోబో 2.0 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. పెళ్లి కాకాండానే గ‌ర్భం దాల్చి అంద‌రికి షాకిచ్చింది. పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేసి గర్భం దాకా తెచ్చేసుకుంది. మ‌ళ్లీ ఈ విష‌యాన్ని ఎంత గ‌ర్వంగా చెప్పుకుందో.

త‌న ప్రెగ్నెన్సీ ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అమీ. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది, అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కూడా బికినిని వ‌ద‌ల‌డం లేదు అమీ జాక్స‌న్‌. క‌డుపుతో ఉన్న‌ప్పుడు కూడా అమ్మడు బికినిలో ద‌ర్శ‌నం ఇస్తుంది. దీనిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. పెళ్లి కాకుండానే త‌ల్లి అయిన నీకు త‌రువాత ఎలా ఉండాలో తెలియ‌క‌పోవ‌డంలో పెద్ద వింత ఏమి లేదని అంటున్నారు నెటిజ‌న్లు. ఇదిలా ఉంటే అమీ జాక్స‌న్‌కు బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింద‌ట.

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ విదేశి హీరోయిన్ అవ‌స‌రం కాగా, దీని కోసం ఓ హాలీవుడ్ హీరోయిన్‌ని ఎంపిక చేశాడు రాజ‌మౌళి. కాని డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో సినిమా ఆ భామ త‌ప్పుకుంద‌ట‌. ఈ స‌మ‌యంలోనే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అమీ జాక్సన్ వైపు చూశార‌ట‌. అయితే ఆమె గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో రాజ‌మౌళి సినిమాలో ఛాన్స్ మిస్ అయింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అమీ జాక్స‌న్ గ‌తంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎవ‌డు సినిమాలో న‌టించింది. ఏది ఏమైనప్ప‌టికి త‌న తొంద‌రపాటు చర్య వ‌ల్ల బంగారం లాంటి ఆఫ‌ర్‌ని చేజార్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -