ఓ బేబీ విషయం లో నిర్మాత అసంతృప్తి అదేనట

139
Oh Baby one of the producer Suresh Babu Not Happy With 'Oh Baby' music director Mikki J Mayer
Oh Baby one of the producer Suresh Babu Not Happy With 'Oh Baby' music director Mikki J Mayer

ఓ బేబీ సినిమా ఇటీవలే విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన సంగతి మన అందటికీ తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వం లో సమంత ప్రధాన పాత్ర లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు కి ఈ సినిమా విషయం లో ఒక అసంతృప్తి ఉందని టాక్ నడుస్తుంది. మొదట నుంచి, ఈ సినిమా లో మిక్కి జె మేయర్ ని సంగీత దర్శకుడి గా తీసుకోవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదట.

అయితే నిజానికి సినిమా లో పాటలు ఒక్కటి కూడా హిట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆశించిన స్థాయి లో లేదు. ఈ విషయం చెప్తూ సురేష్ బాబు ముందు నుండి అతడిని వద్దు అనే నిర్ణయం మీద ఉన్నారట కానీ సమయం లేక, వారు వేరే ఇంకొకరి దగ్గరకు వెళ్లలేకపోయారని తెలిసింది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే, మిక్కీ కూడా ట్యూన్స్ టైం కి ఇవ్వలేదట. షూటింగ్ రెండు రోజులు ఉంది అనంగా అప్పుడు ఇచ్చేవారట. ఆయన తన అమెరికా టూర్ లో బిజీ గా ఉండి ఈ సినిమా మీద ఆశించిన స్థాయి లో శ్రద్ద పెట్టలేదని సురేష్ భావిస్తున్నారట

Loading...