Saturday, April 27, 2024
- Advertisement -

అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. ఏమైంది ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో చాలా సార్లు అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ప్రధానంగా ఓ పంక్షన్ లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆ టైంలో ఎంతటి రాద్దాంతం చేసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలక్షన్స్ టైంలో పవన్ వద్దకు బన్నీ వెళ్లడం మద్దతు తెలవడంతో అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ బన్నీని ఎక్కువగా టార్గెట్ చేయడం లేదు.

తాజాగా మరోసారి బన్నీని కొందరు పవన్ అభిమానులు టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా పుట్టిన రోజు అని తెల్సిందే. అకీరా బర్త్ డే సందర్భంగా చిరంజీవి.. నాగబాబు.. రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్ లు ట్విట్టర్ లో విషెష్ చెప్పారు. ఇక ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అకీరా పుట్టిన రోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. పలువురు ప్రముఖులు కూడా అకీరాకు విషెష్ చెప్పగా బన్నీ మాత్రం అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదంటూ పవన్ ఫ్యాన్స్ కొందరు మండిపడుతున్నారు. నిన్న బర్త్ డే జరుపుకున్న అఖిల్ కి బన్నీ శుభాకాంక్షలు చెప్పాడు.

కానీ అకీరాకు మాత్రం చెప్పలేదు. అందుకే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ బన్నీని ప్రశ్నిస్తున్నారు. అఖిల్ కు విషెష్ చెప్పకుంటే అకీరా విషయంలో కూడా బన్నీని అనేవాళ్లం కాదు. కాని అఖిల్ కు చెప్పి అకీరాకు చెప్పక పోవడం తమకు కోపంను కలిగిస్తుందని.. మరోసారి పవన్ అంటే అగౌరవంను బన్నీ ప్రదర్శించాడంటూ పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ బన్నికి మద్దతుగా నిలబడుతున్నారు. ఈ చిన్న విషయాన్ని కూడా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -