పవన్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే ?

525
Pawan Kalyan Remuneration for his First Film
Pawan Kalyan Remuneration for his First Film

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజం తో పవర్ స్టార్ గా మారిపోయాడు. ‘తొలిప్రేమ’ ‘సుస్వాగతం’ ‘ఖుషీ’ ‘జల్సా’ ‘గబ్బర్ సింగ్’ ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాలతో తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించాడు. మొత్తం 25 చిత్రాల్లో నటించిన పవన్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది.

దాంతో రాజకీయాలు చూసుకుంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్. వరుస సినిమాలను ఓకే చేస్తూ కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. అయితే పవన్ తన మొదటి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా పారితోషకం గురించి పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

ఆ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. తన ఫస్ట్ మూవీకి అల్లు అరవింద్ నెలకి ఐదు వేల రూపాయలు ఇచ్చేవాడని.. సినిమా పూర్తయ్యే వరకు ఇలానే ఇచ్చుకుంటూ వచ్చాడని తెలిపాడు. అంటే పవన్ తన ఫస్ట్ మూవీకి నెలకి ఐదు వేల మాత్రమే తీసుకున్నాడు. అయితే పవన్ డెబ్యూ మూవీకి ఇంత తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Loading...