Friday, April 26, 2024
- Advertisement -

శ్రీదేవి గా అదరగొట్టిన పూజ హెగ్డే

- Advertisement -

ఈ మధ్య కాలం లో ఏ హీరో అయినా కొత్తగా తనని తాను స్క్రీన్ మీద ఆవిష్కరించుకున్నాడు అంటే అది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక్కడే. వరుణ్ తేజ్ తనదైన శైలి లో కాకుండా కాస్త స్టైల్ మార్చి ఈ సినిమా ని చేసాడు. ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా అందరినీ బాగా అలరిస్తుంది. చాలా థియేటర్ల లో హౌస్ ఫుల్ కూడా అయింది. ఈ సినిమా కి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యం గా వరుణ్ తేజ్ గడ్డలకొండ గణేష్ పాత్ర లో చాలా బాగా నటించి అందరి మెప్పు ని పొందాడు.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ విషయానికి వస్తే పూజ హెగ్డే ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఈ పాత్ర ఒరిజినల్ లో లేదు కానీ హరీష్ శంకర్ కొత్తగా యాడ్ చేశారు. అయితే శ్రీదేవి పాత్ర లో పూజ అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు. మొదటి సారిగా ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్ర లో నటించి సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూ గ్లామర్ ని బాగా పండించడమే కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది అని చెప్పుకోవచ్చు.

పూజ హెగ్డే ఖాతా లో మరొక హిట్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఫలితం లేకుండా పూజ కి మాత్రం అటు ప్రశంసలు ఇటు అవకాశాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -