Friday, April 26, 2024
- Advertisement -

PSV గరుడ వేగ మూవీ రివ్యూ

- Advertisement -

గత రెండేళ్లుగా హీరో రాజశేఖర్ నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కాస్తా గ్యాప్ తీసుకొని మంచి సినిమా చేయాలని అనుకున్నారు. ఈ నెపథ్యంలో గరుడ వేగ కథ విని వెంటనే ఓకే చేశారు. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈ సినిమా నవంబర్ 3న విడుదలకు చేశారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

నేషనల్ ఇంటెలిజన్స్ ఏజన్సీ ఆఫీసర్ శేఖర్ (రాజశేఖర్). తన డ్యూటీ అంటే ప్రాణం. దాంతో ఇంట్లో ఉండే భార్యని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు డ్యూటీ పనులమీదే తిరుగుతుంటాడు. దాంతో శేఖర్ భార్య (పూజా కుమార్) విడాకులు కోరుతుంది. దాంతో శేఖర్ ఇకపై ఫ్యామిలీకే సమయం కేటాయిస్తానని చెప్తాడు. ఆ తర్వాత జరిగిన చిన్న యాక్సిడెంట్ కారణంగా ప్రొఫెషనల్ స్నైపర్ తో గొడవపడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి టీవీ చూస్తుండగా.. టీవీలో ఒక ముసలామె అనుమానాస్పదం గా మరణించడం చూసి.. స్నైపర్ పై అనుమానం వస్తుంది. ఇక శేఖర్ తన టీంతో కలిసి స్నైపర్ పట్టుకునే ప్రయత్నంలో స్నైపర్ చనిపోతాడు. ఈ హత్య వెనక తెలియని మరో మిస్టరీ దాగి ఉంటుంది. ఆ మిస్టరీ ని ఎలా చేదించాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

ఈ సినిమాలో కథ పరంగా చెప్పాలంటే చాలా సింపు. కానీ కథనంతో ఈ సినిమాని మెప్పించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. కథనం ప్రకారం దర్శకుడు అదే చూపించాడు. ఓ 15 , 20 ఏళ్ళ కిందట రాజశేఖర్ కి వున్న యాక్షన్ ఇమేజ్ ని వాడుకొనేలా సత్తారు కధనం మీద శ్రద్ధ తీసుకున్నాడు. డార్జీలింగ్ లో తీసిన మొదటి యాక్షన్ ఎపిసోడ్ మొదలు ఫస్ట్ హాఫ్ చివరిలో వచ్చే చార్మినార్ ఎపిసోడ్ దాకా సినిమా ఓ రేసు గుర్రంలా దూసుకెళుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ రేంజ్ లో ఉంటాయి అని ఊహించి వెళ్లని వారికి అద్భుతంగా అనిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి గరుడ వేగ కధకి సెంట్రల్ పాయింట్ ఎప్పుడైతే ప్రేక్షకులకి తెలిసిపోతుందో అప్పటినుంచి కాస్త నిరశ కలుగుతోంది. అప్పటిదాకా భలే సినిమా చూస్తున్నాం అనే మూడ్ లో వున్న ప్రేక్షకుడు మళ్లీ మామూలు సినిమా చుస్తున్నామా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ప్రేక్షకుడు దారి తప్పకుండా చివరి 20 నిముషాలు ప్రేక్షకుడిని థ్రిల్ కి గురి చేస్తుంది. రాజశేఖర్ కి జీవన్మరణ సమస్య లాంటి సినిమా అనుకున్నప్పటికీ నిజానికి ఇది దర్శకుడు ప్రవీణ్ సత్తారు తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న సినిమా. ప్రవీణ్ సత్తారు ఈ సినిమా తర్వాత కచ్చితంగా ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ తీయడంలో ప్రవీణ్ టాలెంట్ సూపర్బ్. హీరో రాజశేఖర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని సినిమా చూస్తే అర్ధం అవుతోంది. యాక్షన్ హీరోగా అప్పుడున్న ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు. పూజాకుమార్, కిషోర్, శ్రద్ధ దాస్, అలీ, పోసాని కృష్ణ మురళి ఇలా అందరూ ఈ సినిమా విలువ పెంచడానికి దోహదపడ్డారు. ఇక సినిమాటోగ్రఫి మూవీకి మెయిన్ హైలైట్. ఎడిటింగ్ బాగుంది. సన్నీ లియోన్ ఐటెమ్ సాంగ్. ఇది కూడా ప్రేక్షకులతో విజిల్స్ కొట్టిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పేరు పెట్టడానికి లేదు.. సినిమా నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ నిర్మాత కోటేశ్వర రాజు కి సినిమా అంటే పిచ్చి అని తేలిగ్గా చెప్పేయొచ్చు. రాజశేఖర్ తో ఈ టైం లో ఇలాంటి సినిమా తీయడం అతని గట్స్ కి హైట్సఫ్ చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

* రాజశేఖర్, సన్నీలియోన్ ,పూజా కుమార్ ,శ్రద్ధాదాస్ ,కిషోర్
* స్ర్కీన్ ప్లే
* డైరెక్షన్
* యాక్షన్ ఎపిసోడ్స్
*సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకాండఫ్ లో కొన్ని రొటిన్ సీన్స్ రాసుకున్నాడు.

మొత్తంగా : హాలీవుడ్ తరహాలో యాక్షన్ ఉండే సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది. సినిమా చూసాక ఒక కొత్త సినిమా చూసిన ఫీల్ కలుగుతోంది. గరుడ వేగ ఖచ్చితంగా రాజశేఖర్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో వుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -