Saturday, April 27, 2024
- Advertisement -

మహానటి సావిత్రి తో శివాత్మిక రాజశేఖర్ కి పోలిక

- Advertisement -

కల్కి సినిమా తో మళ్ళీ ఫామ్ లో కి వచ్చాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు రాజశేఖర్ తన రెండో కూతురు శివాత్మిక మొదటి సినిమా దొరసాని ని ప్రమోట్ చేస్తున్నాడు. ఎలా అయినా తన ఇద్దరు కూతుళ్ళని స్టార్ హీరోయిన్లు గా చేయాలి అని అనుకుంటున్నాడు రాజశేఖర్. ఆ నేపథ్యం లో ఇప్పటికే శివాని కూడా తన మొదటి సినిమా ని మొదలు పెట్టింది. ఇకపోతే శివాత్మిక గురించి చెప్తూ రాజశేఖర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

ఈ సినిమా కి సంబందించిన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, దొరసాని ట్రైలర్ విడుదల అయ్యాక చాలా మంది ఫోన్ చేశారని, అందరూ తన కూతురిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు అని ఆయన అన్నాడు. అంతే కాకుండా తన కూతురు శివాత్మిక ని మహానటి సావిత్రి తో పోలుస్తున్నారు అని చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

నిజానికి ట్రైలర్ మాత్రమే విడుదల అయింది. ఇంకా శివాత్మిక అసలు ఎలా నటిస్తుంది అనే విషయం పైన క్లారిటీ లేదు. ఎవరో సావిత్రి లాగా ఉందని అనగానే రాజశేఖర్ కూడా తొందరపడి పబ్లిక్ లో ఆ విషయం చెప్పేయడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమా చూసాక అసలు ఆమె సావిత్రి లా ఉందా, లేక అసలు హీరోయిన్ గా పనికొస్తోందా అనేది తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -