Saturday, April 27, 2024
- Advertisement -

సెన్సార్ బోర్డుపై వర్మ సెటైర్లు

- Advertisement -

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటర్లు పేల్చారు. తన దృష్టిలో సెన్సార్ బోర్డు ఔట్ డేటెడ్ అని, అసలు సినిమాలకు సెన్సార్ అవసరం లేదన్నారు. సెన్సార్ వాళ్లు అన్ని రూల్స్ తన సినిమాల మీద ప్రయోగిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు వర్మ.

మనం ఏ సినిమా చూడాలో, చూడకూడదో ఇద్దరు ముగ్గురు సెన్సార్ వాళ్ళు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డ్ నిబంధనల ప్రకారం చూస్తే అసలు ఏ సినిమా కూడా విడుదల కాదని వర్మ తేల్చి చెప్పారు.

తన తాజా సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లుకు సెన్సార్ బోర్డు చూడకపోవడంతో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా తీశానని, ఏ కులాన్ని కించపరచలేదని వర్మ అంటున్నారు. ఎవరినైనా ప్రేమించడానికి ద్వేషించడానికీ తన దగ్గర టైమ్ లేదని సెటైర్ వేశారు.

తనను ఎంత గట్టిగా తొక్కాలని చూస్తే అంత గట్టిగా పైకి లేస్తానని వర్మ అన్నారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించి సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు వర్మ. రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -