సుధీర్ తో సినిమాకు రష్మీ నో.. ఎందుకు ?

2891
rashmi gautam said no to movie with sudigali sudheer
rashmi gautam said no to movie with sudigali sudheer

జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ బాగా హైలైట్ అయ్యాడు. కొన్ని సీనిమాల్లో కమెడీయన్ గా కూడా చేశాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుధీర్ హీరోగా నటించిన చిత్రం “సాఫ్ట్‌వేర్ సుధీర్”. ఈ చిత్రంలో సుధీర్ సరసన రాజుగారిగది ఫేమ్ ధన్యా బాలకృష్ణన్ నటిస్తోంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మీని అనుకున్నారట దర్శక నిర్మాతలు. రష్మీ, సుధీర్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమాకి బాగా హైప్ వస్తుందని భావీంచి రష్మీ గౌతమ్ ను దర్శక నిర్మాతలు సంప్రదించారట. కానీ డేట్స్ సర్దుబాటు కారణంగా ఈ సినిమా నుంచి రష్మీ తప్పుకుందట. దాంతో హీరోయిన్ గా ధన్యా బాలకృష్ణను తీసుకున్నారు. ఈ విషయంను సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుడిగాలి సుధీర్ చెప్పారు.

కాగా, రాజశేఖర్‌ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా,శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో కామెడీగా సాగే కమర్షియల్ చిత్రమిది అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Loading...