ఆనందం హీరోయిన్ రేఖ ఇప్పుడెలా ఉందో చూశారా ?

1805
rekha intresting comments on her death news
rekha intresting comments on her death news

సినీ పరిశ్రమలో ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. ప్రధానంగా హీరోహీరోయిన్స్ విషయంలో ఊహించని మలుపులు ఉంటాయి. కొందరు ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉంటే మరికొందరు కనుమరైపోతుంటారు. ఒకప్పుడు యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ రేఖ.. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

”కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.. నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా” అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రేఖ. ’ఆనందం’ మూవీలో నటించి.. ఈ పాటకు ఆమె చూపిన అభినయం, హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే ముద్రించుకొని ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం అలా ‘ఆనందం’గా అలరించిన రేఖ వెండితెరకు దూరమైపోయింది. తర్వాత కొత్త హీరోయిన్స్ రావడంతో రేఖను అందరు మర్చిపోయారు. ఒకానొక సమయంలో రేఖ మరణించిందనే వార్తలు కూడా షికారు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సర్ ప్రైజ్ చేసింది.

కొన్నేళ్ల క్రితం తాను చనిపోయినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్న రేఖ.. బతికుండగానే శ్రద్ధాంజలి ఫొటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి అంటూ సరదాగా స్పందించింది. ఇక తాను నాగార్జున హీరోగా రూపొందిన ‘మన్మథుడు’లో గెస్ట్ రోల్ చేసానని, అది కేవలం నాగార్జున గారి కోసమే చేసానని చెప్పింది రేఖ. అయితే ఆ తర్వాత ఆయన తనతో కలిసి మరో సినిమా చేద్దామన్నారు కానీ.. ఇప్పటివరకు ఫోన్ చేయలేదని చెప్పింది. ”నాగార్జున గారూ మీ ఫోన్ కోసం వెయిటింగ్ ఇక్కడ” అని చెప్పింది. అలానే ఇంకా పెళ్లి చేసుకోలేదని. మంచి అబ్బాయి కోసం వెయిటింగ్ అని చెప్పింది రేఖ.

Loading...